*వేదగిరి నరసింహ స్వామిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు*
నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహ కొండపై వెలసి ఉన్న శ్రీ వేదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేమిరెడ్డి దంపతులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు చేసి వేమిరెడ్డి దంపతులకు ఆశీర్వచనాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నరసింహ స్వామి ఆలయ సేవా కమిటీ సభ్యులు అచ్యుత్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి, ఆవుల వాసు. జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.