*వెన్నుపోటుకు మాజీ సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి*
కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటుకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు అనే పదాన్ని ఉచ్చరించే అర్హత జగన్ కి గానీ.. వైస్సార్సీపీ నేతలుగాని లేదని అయన వ్యాఖ్యానించారు.
నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే దాన్ని వెన్నుపోటు అంటావా అంటూ అయన ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లికి, తొడ బుట్టిన చెల్లికి వెన్నుపోటు పొడిచిన నీచుడు జగన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన జగన్.. వెళ్లి బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుకున్నాడని ఏద్దేవా చేశారు. వై ఎస్ వివేకానందా రెడ్డిని గొడ్డలి పోటు పొడిచింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు..
ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ ఆత్మ KVP, సూరీడు లను వెన్నుపోటు పొడిచింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.. ఆస్తి కోసం షర్మిలను ఇంటి నుంచి గేంటేసి.. వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైస్సార్సీపీ పనికిమాలిన పార్టిగా కోటంరెడ్డి అభివర్ణించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోటంరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేకుండా స్టేట్మెంట్స్ ఇస్తే.. వాటిని వైస్సార్సీపీ నేతలు మూర్ఖులు లాగా ఫాలో అవుతున్నారని మండిపడ్డారు.
వైస్సార్ ను అభిమానించే నేతలు ఒక్కరైనా వైసీపీలో ఉన్నారా అని అయన ప్రశ్నించారు. వారందరిని జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రౌడీ షీటర్స్ ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ని రౌడీషీటర్ అనాలా..? శాడిస్ట్ అనాలా అని ప్రశ్నించారు. జిల్లాలో ఉండే వైస్సార్సీపీ నేతలకు దమ్ము దైర్యం ఉంటె తన ప్రశ్నలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో మామిడాల మధు, పిట్టి సత్యనగేశ్వర రావు, కువ్వరపు బాలాజీ, తంబి సుజన్ కుమార్, అంచురు శ్రీనివాసులు నాయుడు,సుభాన్ భాష పీరిగల నవీన్, పాల్గొన్నారు.