*వెంకటాచలం మండలం చవటపాళెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు, రైతు సంఘం నాయకులు*
*ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించిన తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు*
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు…
సివిల్ సప్లయీస్ శాఖ అధికారులే రైతుల వద్ద శాంపిల్ సేకరించి నెమ్ము శాతం తేల్చాలని చెప్పాం
కొనుగోలు కేంద్రానికి ఏ రైసుమిల్లరు రాకుండా అధికారులే అంతా పర్యవేక్షించాలని సూచించాం
రైతులందరూ ఐక్యంగా ముందుకు సాగి మంచి ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలి
బియ్యం ఎగుమతులకు కూడా అనుమతి ఇవ్వాలని అధికారులను కోరాం
ఎగుమతుల అంశంతో పాటు ధాన్యానికి బోనస్ ఇచ్చే విషయాలను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట ఇచ్చారు
గతంలోనూ ఆయన రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తూ వచ్చారు
రైతుల పనిచేసే విషయంలో ఎన్జీ రంగా, వడ్డే శోభనాద్రీశ్వరరావు తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే
అన్నదాతకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించే వరకు విశ్రమించరు