*”వెంకటాచలం మండలంలో పూజితమ్మ పర్యటన”*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:12-06-2025*

*సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి కాకాణి పూజితమ్మ*

*అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సర్వేపల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరుగుంట ప్రభాకర్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న శ్రీమతి కాకాణి పూజితమ్మ.*

*అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్లవారిపాళెం వైసిపి నాయకులు గుమ్మా మోహన్ గారి తండ్రి గుమ్మా రామచంద్రయ్యగారిని పరామర్శించిన శ్రీమతి కాకాణి పూజితమ్మ.*

*తిరుమలమ్మపాళెం గ్రామానికి చెందిన వైసిపి యువ కార్యకర్త సందూరి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురై మరణించండంతో పార్ధీవదేహానికి పూలమాలవేసి, నివాళూలర్పించి, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శ్రీమతి కాకాణి పూజితమ్మ.*

*రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటకృష్ణయ్య ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన శ్రీమతి కాకాణి పూజితమ్మ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *