*వెంకటాచలం నగరవనానికి రూ.2 కోట్లు నుడా నిధులు*
*మరిన్ని నిధులు కూడా మంజూరు చేసేందుకు సిద్ధం*
*నగర వనం పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి*
నుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రాంతానికి ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను
అడవిలో శివాలయాన్ని సందర్శించి శ్రీ అభయలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది
రాజకీయంగానూ, అభివృద్ధి పరంగానూ ఏదైనా ఒక పట్టుపడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వదలరు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారధ్యంలో నగరవనం రాష్ట్రంలోనే అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది
ఈ ఏడాదికి నుడా నిధులు రూ.2 కోట్లు కేటాయిస్తున్నాం…భవిష్యత్తులోనూ మళ్లీ నిధులు కేటాయిస్తాం
ప్రస్తుతం అడవిలో శివయ్యగా పిలవబడుతున్న అభయలింగేశ్వర స్వామి భవిష్యత్తులో నగరవనంలో శివయ్యగా మారడం ఖాయం
నెల్లూరు నగరానికి ఈ నగర వనం టూరిజం స్పాట్ గా మారడం ఖాయం
గతంలో నేను నుడా చైర్మన్ గా ఉన్న సమయంలో పల్లెల్లో పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాను
తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం వద్ద పార్కు నిర్మాణానికి రూ.50 లక్షలు ఇచ్చాం
ముత్తుకూరులోనూ పార్కు నిర్మాణానికి నిధులు కేటాయించాం. 2019లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు జరగలేదు..మళ్లీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం
గొలగమూడి, మనుబోలుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా నుడా నిధులతో పనులు చేపట్టేందుకు ఎప్పుడూ ముందుంటాం