*వెంకటాచలంలో అంబరాన్నంటిన సంబరాలు : గుమ్మడి రాజా యాదవ్*
*సర్వేపల్లి శాసన సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బుధవారం సాయంత్రం వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు*
*టీడీపీ నిర్వహించిన విజయోత్సవ సంబరాలలో టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, కుంచి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా విచ్చేశారు*
*పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు*
*తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు*
*సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుపొందిన సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ కట్ చేశారు*
*టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కేరింతలతో నృత్యాలు చేశారు*
*దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది*
*ఒకరిపై ఒకరు రంగులు చెల్లుకొని సోమిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు*
*చంద్రబాబు క్యాబినెట్ లో సోమిరెడ్డి గారికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు*
*ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.*