వీసీల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించకపోవడం సిగ్గుచేటు.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
గుంటూరు అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల అనంతరం.. *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు
*చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్..*
👉 *నేడు శాసనమండలిలో స్పీకర్ గారి సాక్షిగా 17 మంది వీ సి ల రాజీనామాలపై నాలుగు రకాల ఆధారాలను మంత్రి లోకేష్ కు అందజేశామని తెలిపారు.*
👉 *స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మేము రాజీనామా చేస్తున్నామని 5 మంది వీ సీలు లేఖల్లో పేర్కొంటూ మీకు అందజేసిన వెంటనే దీనిపై ఒక విచారణ కు ఆదేశించి ఉండాలన్నారు.*
👉 *విచారణకు ఆదేశించకపోవడం ప్రభుత్వ తప్పిదమేనన్నారు.*
👉 *వైసిపి ప్రభుత్వం లో యూనివర్సిటీ స్థాయి ప్రమాణాలు మెరుగుపడ్డాయని అందుకు ఉదాహరణ…ఆంధ్ర యూనివర్సిటీ అని పేర్కొన్నారు.*
👉 *తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీకి NAAC-A గ్రేడ్ ఉండగా.. వైసీపీ ప్రభుత్వంలో.. NAAC-A++ గ్రేడ్ సాధించి… భారతదేశంలోని టాప్ 3 స్థానం లో ఆంధ్ర యూనివర్సిటీ నిలిచిందన్నారు.*
👉 *వై సి పి ప్రభుత్వం లో ఇలా ప్రతి యూనివర్సిటీ వాటి ర్యాంకులను మెరుగుపరచుకొని.. ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నారు.*
👉 *వీసిల బలవంతపు రాజీనామాలపై.. తెలుగుదేశం పార్టీ మూకలు వీసీలను రాజీనామా చేయాలని బెదిరిస్తున్న వీడియో క్లిప్పింగులతో పాటు పేపర్ కటింగ్ ఆధారాలను మంత్రి లోకేష్ కు సమర్పించడం జరిగిందన్నారు.*
👉 *ఇలా అన్ని రకాల ఆధారాలు సమర్పించి.. జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని కోరామని తెలిపారు.*
👉 *నాలుగు రకాల ఆధారాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వీసీల రాజీనామాలపై వెనకడుగు వేయడం సిగ్గుచేటు అన్నారు.*
👉 *ఆధారాలు అందజేసినప్పటికీ.. లోకేష్ విచారణకు ఆదేశించకుండా.. మాట తప్పారని మండిపడ్డారు.*
👉 *భవిష్యత్తులో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను.. ఎత్తిచూపి.. వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.*