వీర మహిళలూ
మీరు ఒంటరిగా లేరు… మీ బలానికి, మీ లక్ష్యాలకు మేమంతా తోడుగా ఉంటాం , మనం కలిసికట్టుగా నడిస్తే – జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా మారుతుంది!
*కిషోర్ గునుకుల_ జనసేన*
పెద్దలు సూచనలతో జిల్లా కార్యాలయంలో జనావాని కార్యక్రమం నిర్వహించడం చూశాను..పెద్దలు అనుమతి ఇస్తే మహిళలు ఏదైనా సమస్యలు చెప్పుకునేలా నెల లో ఒక రోజు మేమిక్కడ మహిళా జనవాణి కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము..
*విజయలక్ష్మి గునుకుల-జనసేన*
*జనసేన జిల్లా కార్యాలయం లో గోమతి నగర్ లో వీర మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి*
* కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే స్థాయి నుంచి దేశ పరిపాలనా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన మహిళలను చూస్తే గర్వంగా ఉంది.
* ఇందుకు ఉత్తమ ఉదాహరణ మన దేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. మారుమూల పంచాయతీ స్థాయి నుంచి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన ఆమె ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
_కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే అపారమైన శక్తితో పాటు, ఈ ప్రపంచానికి ప్రేమను , శాంతిని అందించగల గొప్ప సామర్థ్యం మహిళల్లోనే ఉంది!_
*మన నెల్లూరు వీర మహిళలథ చరిత్ర….పుస్తకాల్లో మిగిలిపోయేది కాదు….*
*భావితరాలకు స్ఫూర్తినిచ్చేది … సమాజానికి వెలుగునిచ్చేది…*
సారా కి బానిసలైన తన కుమారులను చూసి , తన కుటుంబం లాగ మరే కుటుంబం నాశనం కాకూడదని దూబగుంట అనే చిన్న గ్రామంలో మొదలుపెట్టిన సారా వ్యతిరేక ఉద్యమాన్ని , జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి , రాష్ట్రాన్ని కదిలించి , అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి చేత మద్యపాన నిషేధం చేయించిన వీరమాత దూబగుంట రోశమ్మది మన నెల్లూరే .
మహాత్మా గాంధీ గారి స్పూర్తితో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఖద్దరును ప్రోత్సహించి, పల్లిపాడులో పినాకిని సత్యాగ్రహాశ్రమాన్ని స్థాపించి, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ, శ్రీ కస్తూరిదేవి విద్యాలయాన్ని ఒక అద్దె ఇంట్లో ప్రారంభించి, అక్షరజ్యోతిని పంచిన మహోన్నత వ్యక్తి , సంఘ సేవిక పొణకా కనకమ్మ గారిది మన నెల్లూరే.
పంచాయతీ పరిపాలన విధులు మన తెలివికి మించినవి కావు , గృహ నిర్వహణ ఎలాగైతే చేస్తామో , గ్రామ నిర్వహణ కూడా అలాగే చేద్దాం అని భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా పంచాయతీ అధ్యక్షురాలుగా ఎన్నికైన వీరమహిళ వవ్వేటి విమలాదేవి గారిది మన నెల్లూరే .
అటువంటి గొప్ప మహిళల పోరాట స్ఫూర్తి తో నేడు ఎందరో నెల్లూరు వనితలు వీరోచితంగా పోరాడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు నుండి కూడా మహిళల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ వచ్చారు. 1999లో పవన్ కల్యాణ్ గారు చంచల్ గూడలోని మహిళా జైలును సందర్శించి మహిళా ఖైదీల సమస్యలు తెలుసుకున్నాడు. అలాగే జనసేన పార్టీని స్థాపించి కొనసాగిస్తున్న రాజకీయ యజ్ఞంలో మా వీర మహిళలు అందిస్తున్న సేవలు, వారి అండదండలు వెలకట్టలేనివని , చిరస్మరణీయమైనవి , స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లుతాయని , మహిళాభ్యున్నతికి, వారికి రాజకీయ, ఆర్ధిక, సాంఘికంగా సమాన అవకాశాల సాధనలో మహిళలకు తన వంతు సహకారం అనునిత్యం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు.
మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మహిళల సమస్యల గురించి ముందుగా గొంతెత్తే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.పాకిస్థాన్ , బాంగ్లాదేశ్ దేశాలలో హిందూ సోదరీమణులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తనను గెలిపించిన పిఠాపురం ఆడపడుచులకు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో భాగంగా సారె రూపంలో దాదాపుగా 12 వేల చీరలను పంచిపెట్టారు. మన దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని , శాసనసభ లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని , మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు.
“మహిళల అభివృద్ధి కాదు, మహిళల ద్వారా అభివృద్ధి” అనే నినాదంతో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు “నారీ శక్తి వందన్ అధినియం” పేరుతో లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో 33% (మూడో వంతు) మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదింపజేశారు . అలాగే బాలికల కోసం బేటీ బచావో-బేటీ పఢావో , మహిళల కోసం ఉజ్వల యోజన , ముద్ర యోజన లాంటి అనేక కార్యక్రమాలు ఎన్డీయే కూటమి తీసుకొచ్చింది .
సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్న మహిళలందరికీ శుభాకంక్షాలు తెలియజేస్తూ ….
సమస్త మహిళా శక్తికి నా ప్రణామం !
*జై నారీ శక్తి ! జై జనసేన ! జై పవన్ కళ్యాణ్ ! జై హింద్ !*