వీరసైనికులవీరోచిత పోరుకు, వేడాయపాలెంలో తిరంగయాత్ర
—–
కాశ్మిర్ పహాల్గామ్ లో తీవ్రవాదుల దాడి అనంతరం
భారత్ ప్రభుత్వం చేయట్టిన ఆపరేషన్ సిందూర్ లో తీవ్రవాడ శిభిరాలను చేయడంలో వీర సైనికుల వీరో చి తా పోరుకు మద్దతుగా దేశావ్యాప్తంగా మువ్వెన్నల జెండాతో తీరంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని వేడాయపాలెం సెంటర్ నుంచి అయ్యప్పాగుడి సెంటర్ వరకు
భారీఎత్తున తి రంగా ర్యాలీ ఆదివారం జరిగింది. వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. వీరసైనికులకు జై, అమర సైనికులకు జోహార్లు.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పెద్దఎత్తున పురవీ ధులలో మువ్వెన్నుల జెండా చేబుని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ
మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగరాలసురేష్ మీడియా తో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ఒక ట్రయిల్ మాత్రమే పాకిస్తాన్ చూసిందని కాశ్మిర్ తీవ్రవాదుల ఆగదాలు ఆపకపోతే మరిన్ని ఆపరేషన్ సిందూర్ లు పాక్ చూడాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ పోరులో అమరులైన సైనికులకు జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోవేదయపాలెం బిజెపి మండల అధ్యక్షులు లింగాల. రామకృష్ణ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు యన్ సీ. పెంచలయ్య, రూరల్ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మండ్ల.ఈశ్వరయ్య కార్పొరేటర్లు భీమినేని.మురహరి,బూడిద.పురుషోత్తం,బద్దెపుది.గిరి,టిడిపి డివిజన్ల అధ్యక్షులు మలేపాటి.వెంకటేశ్వర్లు,మల్లిబోయిన. వెంకటేశ్వర్లు, గుద్దేటి.చెంచెయ్య,ఉప్పు. భాస్కర్,బిజెపి నాయకులు పి.మల్లికార్జున,గుంజి.కృష్ణ,టిడిపి మైనారిటీ నాయకులు నాయకులు జావెద్,అస్లాం తదితరులు పాల్గొన్నారు.
