*వీపిఆర్ సహకారంతోనే మాకు మైనింగ్ అనుమతులు*

*. దయచేసి రాజకీయాల్లోకి మమ్మల్ని లాగకండి*

*…వెంకటగిరి రాజాలకు చెందిన*
*శ్రీ కళ్యాణరామ కంపెనీ కీలక ప్రకటన*

*వెంకటగిరి రాజా లకు చెందిన మైనింగ్ ప్రధాన గణిత సంబంధించి అనుమతులు ఇవ్వడంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ వంతు సహకారం అందించారనివెంకటగిరి రాజాలకు చెందిన శ్రీ కళ్యాణరామ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. వెంకటగిరి కేంద్రంగా తమ మైనింగ్ కంపెనీ పనిచేస్తుందన్నారు. సైదాపురం మండలం, కలిచేడు & గోకులబ్రిందవనం గ్రామాలలో మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్డ్‌స్పార్ క్వారీలను కలిగి ఉన్నామన్నారు.*

*తాము 1920లు/1930ల నుండి AP రాష్ట్రంలో మచ్చలేని రికార్డుతో మా మైకా, క్వార్ట్జ్ & ఫెల్డ్‌స్పార్ క్వారీలను నిర్వహిస్తున్నామని మా ఐదవ తరం కుటుంబ సభ్యులు క్వారీయింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారన్నారు. దయచేసి కొందరు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి తమను లాగ వద్దన్నారు. వాస్తవాలను ప్రతి ఒక్కరు గమనించాలన్నారు*

*కొందరు స్వార్థ ప్రయోజనాలు మరియు తప్పుదారి పట్టించే ప్రాధాన్యతల కారణంగా మా క్వారీలు ప్రస్తుతం పనిచేయడం లేదని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలవంతం చేశారని కొందరు చెప్పడం అవాస్తవాలు అన్నారు. తమ క్వారీలకు అనుమతులకు విపిఆర్ చేసిన సహకారాన్ని ఆ ప్రకటనలో గుర్తు చేసుకున్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed