వీధి దీపాల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి
– టిడ్కో ప్రాంగణంలో హెల్ప్ డెస్క్, సచివాలయం, ఆసుపత్రుల ఏర్పాట్లు
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక 54వ డివిజన్ వెంకటేశ్వరపురం, మసీదు సెంటర్, లక్ష్మీ స్ట్రీట్ ప్రాంతాలలో పర్యటించి, జనార్దన్ రెడ్డి కాలనీ టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణాన్ని కమిషనర్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణాలలో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు సచివాలయ ఏర్పాటు, హెల్ప్ డెస్క్, అర్బన్ హెల్త్ సెంటర్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
స్థానిక సచివాలయాన్ని టిడ్కో ప్రాంగణంలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. వెంకటేశ్వరపురం గృహ సముదాయాల ప్రాంగణంలో హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని నూతనంగా ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని, ఇతర వివరాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ సముదాయాల ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించి అవసరమైన అన్ని వైద్య సేవలను అక్కడే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. డివిజన్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
అనంతరం స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ హెడ్ వాటర్ వర్క్స్ కార్యాలయం లోని స్టోర్ లోని విద్యుత్ విధి దీపాలను కమిషనర్ పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను అమర్చి వాటి నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ. రహంతు జానీ, హౌసింగ్,ప్లానింగ్,వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
.