*వీధి కుళాయి నుంచి వృధాగా నీరు కారిపోవడాన్ని గమనించిన  స్వయంగా కుళాయిని కట్టివేసిన కమిషనర్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 36వ డివిజన్ సి.ఏ.ఎమ్ స్కూల్ మార్గంలో గురువారం పర్యటించారు.

వర్షాలకు ఆ ప్రాంతంలో డ్రైను కాలువల ప్రవాహాన్ని కమిషనర్ పరిశీలించారు. వరదనీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూడికతీత పనులను చేపట్టాలని, సిల్ట్ తొలగింపును కూడా క్రమం తప్పకుండా చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.

మార్గమధ్యంలో వీధి కుళాయి నుంచి వృధాగా నీరు కారిపోవడాన్ని గమనించిన కమిషనర్ స్వయంగా కుళాయిని కట్టివేసారు.

స్థానిక ప్రజలకు నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి వాడకం అయిపోయిన తర్వాత వీధి కుళాయిలను నిర్లక్ష్యంగా వదిలివేయకుండా తప్పనిసరిగా కట్టివేయాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed