*వి.ఎస్.యూ వైస్ ఛాన్సలర్ విజయభాస్కర రావు విభాగ అధికారులతో ప్రతేక సమావేశం.*
………………
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయభాస్కర రావు వివిధ విభాగ అధికారులతో ప్రతేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ విభాగాల ప్రగతి, పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు అందించే సేవల మెరుగుదల, మరియు కొత్త ప్రణాళికల అమలు గురించి విస్తృతంగా చర్చించబడింది.
ముఖ్యంగా, పరీక్షల సంస్కరణలు, ఫలితాల వేగవంతమైన విడుదల, డిజిటల్ ఇనిషియేటివ్‌లు, మరియు పారదర్శకత కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైస్ ఛాన్సలర్ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలను అందించారు.
ఆయన ప్రత్యేకంగా, పరీక్షల సంస్కరణ లో భాగంగా ఈ డి పి సెల్ ఏర్పాటు, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుల పద్ధతులు, మరియు ప్రశ్న పత్రాల బ్యాంక్ అభివృద్ధి వంటి ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు.
ఈ సమావేశం లో రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య సిహెచ్ విజయ,ఆచార్య టి.వీర రెడ్డి, పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి, డీన్ సి డి సి డాక్టర్ యం. హుస్సేనయ్య, ఐ క్యు ఏసి డైరెక్టర్ ఆచార్య అందే. ప్రసాద్, ఆచార్య కె.వి.ఎస్.యన్.జవహర్ బాబు, డాక్టర్ ఆర్. ప్రభాకర్, సూపర్నెంట్ జి.రామకృష్ణ, మరియు యఫ్ ఓ, చాముండేశ్వరి తదితలు పాల్గొనారు.