_*వి ఎస్ యూ లో వీర్ బాల్ దివాస్…*_
…………………..
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎస్.విజయభాస్కర రావు గారు జెండా ఊపి ర్యాలీను ప్రారంభించారు.
కళాశాల భవన్ నుంచి ప్రారంభించబడిన ర్యాలీ ఎస్ పి ఎస్ ఆర్ భవన్ వరకు వీర్ బాల్ గూర్చిన నినాదాలు చేస్తూ వీర్ బాల్ ప్లకార్డులు చేపట్టి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.
తదనంతరం సర్ సివి రామన్ సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర గారు మాట్లాడుతూ మతం మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్ జాద జురాబర్ సింగ్ వయసు 9 ఏళ్ళు పతేసింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషమని అన్నారు. వీర్ బాల్ తివాద్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని రాబోయే తరాలకు సత్య ధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ కూడా ఈ వీరబాలుల ధైర్య సాహసాలను దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీమతి కె.రాజేశ్వరి గారు మాట్లాడుతూ దేశభక్తి కలిగి దేశ సార్వభౌతృత్వానికి సమగ్రతకు మరియు అభివృద్ధికి అంకితభావం కలిగి ఉండాలని కోరారు. మరొక వక్త ఎస్ వి సావర్కర్ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యత గురించి మరియు చరిత్ర గురించి విపులంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ సభాదక్ష్యత వహించుగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి వి సుబ్బారెడ్డి మరియు సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో
యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు విజయ శ్రీ గారు, డాక్టర్ ఓబులపతి డాక్టర్ శంకర్ మరియు పెద్ద ఎత్తున యన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.