*వి ఎస్ యూ లో భూమిలేని రైతు కూలీల సామాజిక ఆర్థిక స్థితిగతుల పై అవగాహన కార్యక్రమం *
వి ఎస్ యూ యన్ ఎస్ ఎస్ యూనిట్ -3,4 మరియు సామాజిక సమరసట వేదిక సంయుక్తంగా భూమిలేని రైతు కూలీల సామాజిక ఆర్థిక స్థితిగతుల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ కూడా మన దేశజనాభ లో షుమార్ పది శాతం వున్న వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల పై అవగాహన ఎంత అయినా ఉందని చెప్పారు. రైతు కూలీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల గురించి అలాగే గ్రామీణ మరియు అర్బన్ కూలీల మధ్య నెలకొన్న వత్యాసల గురించి విపులం గా వివరించారు. సాంకేతిక మార్పుల పై రైతు కూలీల కు అవగాహన కల్పించి తద్వారా వారి జీవనోపాధిని పెంపొందించే అవకాశాలు ఉన్నాయని తెలియచేసారు. ఆ దిశగా విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీ కే. పరిశురామయ్య రిటైర్డ్ ఐ ఏ ఎస్ గారు భూమిలేని రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకోవలసిన కొన్ని అంశాలు పై విపులంగా చర్చించారు. వ్యక్తిగతంగా తను చూసిన కొన్ని ప్రత్యేక సంగతులను ప్రస్తావిస్తు రైతు కూలీల బాధలను వివరించారు. NSS వాలంటీర్లు రైతుకూలీల కు ఉపయోగ పడే ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి డా. యం హనుమారెడ్డి గారు అధ్యక్షత వహించగా డా.ఉదయ్ శంకర్ అల్లం కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. అలాగే, డా.కే. సునీత గారు, శ్రీ కోడూరు సత్యం గారు, కే. కేశవులు గారు వక్తలుగా అంశం పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ గారు, రైతుంకులీలు, మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.