*వి ఎస్ యూ లో ఒత్తిడి నిర్వహణపై ఒరియంటేషన్ …*
……………..
కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ యన్‌ఎస్‌ఎస్ యూనిట్ -2 ఆధ్వర్యంలో ఒత్తిడి నిర్వహణ (Stress Management) పై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, గౌరవ అతిథిగా ప్రముఖ న్యూరాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు కి చెందిన డాక్టర్ బిందు మీనన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఒత్తిడి నిర్వహణ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు అందరూ ఒత్తిడిని సమర్థవంతం ఎదుర్కొనే తీరును అలవర్చుకోవాలని సూచించారు.

• ఒత్తిడి సహజమే, కానీ దానిని సానుకూల దృక్పథంతో ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం అవసరం.
• విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు విశ్వవిద్యాలయం తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు.
• అందుబాటులో ఉన్న వనరులను విద్యార్థులు సమర్థవంతం వినియోగించుకోవాలని సూచించారు.
• ఒత్తిడిని నిర్వహించడంలో మానసిక స్థైర్యం, ప్రణాళికాబద్ధత, సమయపాలన ఎంతో ముఖ్యం అని వివరించారు.
• భవిష్యత్తులో మరిన్ని మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ, ఒత్తిడి మన మీద మానసిక, శారీరక ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని వివరించారు.
• ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన, మైగ్రేన్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
• ఒత్తిడిని సమర్థవంతం నిర్వహించేందుకు విద్యార్థులు, ఉద్యోగులు పాటించాల్సిన ముఖ్యమైన మార్గాలను సూచించారు:
• ధ్యానం & యోగా – మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇవి ఎంతో సహాయపడుతుంది.
• సానుకూల ఆలోచనలు – ప్రతి సమస్యను సానుకూల ఆకలోచనలతో పరిష్కరించగలమనే ధృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి.
• నియమితమైన వ్యాయామం – శారీరక శ్రమ మనస్సును తేలిక చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.
• సమయ నిర్వహణ – సరైన ప్రణాళికతో పని చేయడం వల్ల అనవసర ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
• సమతుల్య ఆహారం & మంచినిద్ర – ఆరోగ్యకరమైన జీవన శైలి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
డాక్టర్ బిందు మీనన్ విద్యార్థుల సందేహలకు ప్రశ్నలకు సమాధానాలు అందించారు.

రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మానసిక ఆరోగ్యంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు స్వీయ మెరుగుదల కోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్.విజయ,డాక్టర్ ఎస్.బి.సాయినాథ్ యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, యూనిట్-II,హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ,డాక్టర్ ఎం.హనుమ రెడ్డి కోఆర్డినేటర్ విద్యార్థి సంక్షేమం, ఫుడ్ టెక్నాలజీ అధ్యాపకులు మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed