*వి.ఎస్.యూ లో ఎన్ఎస్ఎస్ విభాగం మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం*
……….
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఎన్ఎస్ఎస్ విభాగం మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా కిషోరి వికాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర రావు, విశిష్ట అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత హాజరయ్యారు.
ఈ సందర్భంగా, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర రావు గారు మాట్లాడుతూ:
“మహిళల సాధికారతకు విద్య ముఖ్య సాధనం. క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యం, మరియు ఆత్మవిశ్వాసం ద్వారా వారు సమాజంలో అగ్రస్థానాన్ని సాధించగలరు. బాల్య వివాహాలు కేవలం వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయడమే కాదు, సమాజ ప్రగతిని కూడా అడ్డుకుంటాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై అవగాహన కలిగి ఉండాలి” అని అన్నారు.
రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు తన ప్రసంగంలో:
“బాల్య వివాహాల నివారణ కోసం యువతుల చైతన్యంతో పాటు సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలి. ఇది పిల్లల హక్కులను కాపాడే ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య సుజా ఎస్ నాయర్, పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్ మధుమతి ,యన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం,యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి వి సుబ్బా రెడ్డి, జిల్లా బాలల సంరక్షణా అధికారి శ్రీ బి.సురేష్, ఎ సి డి పి ఓ అనురాధ, పిడిఐసిడిఎస్ సుశీల దేవి మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.