*వి.ఎస్.యూ పరిశోధన విద్యార్థిని యం. ఎడెలిన జయ హర్షకు డాక్టరేట్…*
……
నెల్లూరు, ఆగస్టు 6:
విక్రమ సింహపురి యూనివర్సిటీ (వి.ఎస్.యూ) కళాశాలలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని యం. ఎడెలిన జయ హర్షకు డాక్టరేట్ ప్రదానం చేయబడింది.
నెల్లూరు నగరంలోని ఓల్డ్ మిలిటరీ కాలనీకి చెందిన ఎడెలిన, వి.ఎస్.యూ బయోటెక్నాలజీ విభాగంలో “మార్ఫోమెట్రిక్ అండ్ మాలిక్యులర్ స్టడీస్ ఆఫ్ సెలెక్టెడ్ లుట్జానిడ్స్ కలెక్టెడ్ ఫ్రం ది ఈస్ట్ కోస్ట్ బెల్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై సమగ్ర పరిశోధన నిర్వహించారు.
ఈ పరిశోధనకు డా. కె.వి.యల్. శ్రీకన్య రావు మార్గదర్శకత్వం వహించారు. తూర్పు తీర ప్రాంతాల్లోని సముద్రజల జీవాలలో ఒక ముఖ్యమైన జాతి అయిన లుట్జానిడ్స్ (Lutjanids) పై భౌతిక నిర్మాణ విశ్లేషణ (Morphometric) మరియు అణు స్థాయి అధ్యయనం (Molecular studies) చేయడం ద్వారా విలువైన సమాచారాన్ని సమకూర్చారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్. విజయ, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ మధుమతి, తదితరులు యం. ఎడెలిన జయ హర్షను ప్రత్యేకంగా అభినందించారు.