_*వి ఎస్ యూ లో మొక్కలు నాటే కార్యక్రమం…*_
*వి ఎస్ యు జాతీయ సేవా పథకం మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ వారు సంయుక్తంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం*
………………..
వి ఎస్ యు జాతీయ సేవా పథకం మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ వారు సంయుక్తంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఆవశ్యకమని తెలిపారు. మొక్కలు లేకపోతే మానవ మనుగడికి ప్రమాదమని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ సమతుల్యతను పాటించడానికి తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అనేక రకములైన రోగాలకు పర్యావరణ కాలుష్యం కూడా ఒక ముఖ్య కారణం అని, కాబట్టి మంచి ప్రాణవాయువు నిచ్చే మొక్కలు నాటితే చాలావరకు అనారోగ్య సమస్యలకు దరిచేరినీయకుండా చేయవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్యాందన్ పాల్గొని మొక్కలను నాటి, మొక్కలలో ఉన్న వివిధ ఔషధ గుణాలను తెలియజేస్తూ ఒక చక్కటి గేయాన్ని కూడా పాడి వినిపించారు రిజిస్ట్రార్ డాక్టర్ కే సునీత, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం,పినాకిని యూత్ వెల్ఫేర్ సారథి శ్రీ మురళీమోహన్ రాజుగారు, డాక్టర్ సిహెచ్ వెంకటరాయలు డాక్టర్ ఎం హనుమారెడ్డి, డాక్టర్ కోటా శ్రీవల్లి ఎంబీఏ విభాగ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.