*వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు అందించిన ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు*

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను కలెక్టర్ గారు ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) సమాజానికి విశేష సేవలను అందిస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. విద్యార్థులలో కమ్యూనిటీ డెవలప్మెంట్‌లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎన్.ఎస్.ఎస్. కీలక పాత్ర పోషిస్తుంది” అని అన్నారు.

అంతేకాక, రాష్ట్ర మరియు దేశస్థాయిలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్న ఫ్రీ రిపబ్లిక్ డే క్యాంప్, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను చూపించడానికి వేదికలుగా నిలిచాయని ప్రశంసించారు. పర్యావరణంతో సంబంధిత విపత్తుల సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల అందించిన సేవలను ఆయన స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు.

అనంతరం, ప్రోగ్రామ్ అధికారులను సమాజ అభివృద్ధి కోసం మరింత శ్రద్ధగా పనిచేయాలని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

అవార్డు గ్రహీతల వివరాలు:
డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్)
డాక్టర్ బి.వి. సుబ్బారెడ్డి (వి.ఎస్.యు కళాశాల)
కే. అంకయ్య (ఆదిత్య డిగ్రీ కళాశాల)
ఐ. సునీల్ కుమార్ (విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల)
టీ. భారతి (దికెడబ్ల్యూ జూనియర్ కళాశాల)
అభినందనలు:
అవార్డు గ్రహీతలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది హృదయపూర్వకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed