*విషానికి విరుగుడు విపిఆర్ అమృత ధార*

– గరళ కంఠుడు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
– నియోజకవర్గంలో 36 అమృతధార వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు
– ఒకే రోజు 5 వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం

ఎంతో ఉన్నత ఆశయంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం జాతరను తలపిస్తోంది. ఒకే రోజు ఐదు వాటర్ ప్లాంట్లను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారితో కలిసి ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
మెట్ట ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చుతూ అండగా నిలుస్తున్నారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అతిధులకు పూల వర్షం కురిపిస్తూ బాణా సంచాలు పేలుస్తూ డీజే కోలాటం, బ్యాండ్ మేళం నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా వి పి ఆర్అమృత ధార వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. మోటార్ బటన్ నొక్కి మంచినీటిని సరఫరా చేశారు. కొళాయిల వద్ద, మహిళలకు బిందేలతో నీటిని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అంటే నాకు అమితమైన ప్రేమ అని తెలిపారు. ఈ నియోజకవర్గ నుండే మొట్టమొదటిసారి విపిఆర్ అమృతధారను ప్రారంభించానన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 170 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశానని తెలిపారు. నియోజకవర్గంలో వెంకట్రావుపల్లి తో 32 వాటర్ ప్లాంట్స్ పూర్తయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు వస్తాయని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ అన్నను అడిగిందే తనువుగా వి పి ఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లను అందిస్తున్నారన్నారు. గరళ కంఠుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా 8 వాటర్ ప్లాంట్లను వేమిరెడ్డి ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు అదనంగా మరో ఐదు వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో అధికంగా ఫ్లోరైడ్ సమస్య ఉందని దీనిని అధిగమించాలంటే సోమశిల జలాల ద్వారా ఇంటింటికీ కొళాయి అందించాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, ఉదయగిరి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు జనసేన కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు ఎల్ పి రమణారెడ్డి తుమ్మల కిరణ్ కుమార్ ఎస్ కే రియాజ్ సర్పంచ్ సత్తెనపల్లి వరలక్ష్మి సత్తెనపల్లి శ్రీ రాములు బొజ్జ నరసింహులు నల్ల పోగు రాజా జనసేన రవీంద్రబాబు బిజెపి నాయకులు నారాయణరెడ్డి వెంకటస్వామి ఎంపీటీసీ సభ్యులు ప్రకాష్ గానుగపెంట ఓబుల్ రెడ్డి బాలకృష్ణారెడ్డి టిడిపి నాయకులు రామలక్ష్మణులు,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed