
*వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి భవనానికి కొలతలు వేసి పరిశీలించి,, స్థానికంగా జరుగుతున్న నూతన భవనాల అనుమతులను తనిఖీ చేసి,, భవనాలకు సంబంధించిన ఖాళీ స్థలం పన్నుల చెల్లింపులను పరిశీలించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణ లో భాగంగా శనివారం స్థానిక 28వ డివిజన్ పోస్టల్ కాలనీ, పరిసర ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి భవనానికి కొలతలు వేసి పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న నూతన భవనాల అనుమతులను తనిఖీ చేశారు. భవనాలకు సంబంధించిన ఖాళీ స్థలం పన్నుల చెల్లింపులను పరిశీలించారు.
డివిజన్ పరిధిలో అన్ని డ్రైన్ కాలువలలో క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేపట్టేలా పర్యవేక్షించాలని వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయకుండా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని, తడి – పొడి వ్యర్ధాలను విడిగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.