
*విపిఆర్ నేత్ర… ప్రజాసేవలో సరికొత్త వెలుగు*
– విపిఆర్ సంకల్పంతో మరో వినూత్న కార్యక్రమం
– విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 3న విపిఆర్ నేత్ర ప్రారంభం
– వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్న ఎంపీ వేమిరెడ్డి
– విపిఆర్ నేత్ర ద్వారా ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, కళ్లజోళ్ల అందజేత
– ప్రజా సేవే పరమావధిగా విపిఆర్ పయనం
విపిఆర్ అమృత ధారతో వందలాది గ్రామాల దాహార్తి తీర్చి అపర భగీరధుడు, ట్రై సైకిళ్లు అందించి దివ్యాంగుల ఆత్మస్థైర్యం అయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జిల్లా వాసుల మదిలో చిరస్థాయిగా నిలిచిన మన సింహపురి ముద్దుబిడ్డ, విద్యా దాత, పేదల ఆశాజ్యోతి.. అన్నార్తుల దీనబంధు అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో కంటి సమస్యలతో బాధపడేవారికి శ్రీ రామ రక్షగా నిలిచేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర అనే బృహత్తర యజ్ఞానికి పూనుకొన్నారు. నవంబర్ 3వ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
*ఉదయగిరి నుంచే ప్రారంభం..*
ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు విపిఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచే ప్రారంభించనున్నారు. ఉదయగిరి ప్రజలంటే తనకు ఎంత మక్కువో ఇప్పటికే అనేక సందర్భాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించిన విషయం విధితమే. ఫౌండేషన్ తరపున విపిఆర్ అమృత ధారను కూడా ఉదయగిరి నుంచే ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేతను కూడా ఇక్కడి నుంచే ఆరంభించారు. అదేవిధంగా నేడు వీ పి ఆర్ నేత్ర ను కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తుండడం విశేషం.
*ప్రజలకు విపిఆర్ ఫౌండేషన్ భరోసా..*
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత ధార అన్న పేరుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 170 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మెట్ట ప్రాంత దాహార్తిని తీర్చి వారి జీవన్మరణ సమస్యను పరిష్కరించారు. విపిఆర్ విద్య ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విపిఆర్ భరోసా ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులను గుర్తించి వారికి ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ అందజేశారు. ఇప్పటివరకు దాదాపు 950 మందికి ట్రై సైకిళ్లు అందించారంటే విపిఆర్ గారి సంకల్పం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. నేడు జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఎంతో సంతోషంగా బయటకు వచ్చి తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారంటే అందుకు కారణం విపిఆర్ అందించిన అండదండలే.
*ప్రతి మహిళ ఆరోగ్యం బాగుండాలని..*
ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి కుటుంబ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోవూరు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్‌కు అందించిన పింక్ బస్సును కోవూరు రప్పించి నియోజకవర్గ మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా చేయించారు. అవసరం అయినవారికి వైద్య సహాయం కూడా చేశారు. నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది మహిళలు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ధైర్యంగా జీవిస్తున్నారంటే అది విపిఆర్ దంపతుల పుణ్యమే.
*విపిఆర్ నేత్రకు ప్రత్యేక బస్సు..*
విపిఆర్ నేత్ర కార్యక్రమం కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు. బస్సులో ఏఆర్ మెషీన్, విజన్ ఎల్ఈడీ ఛార్ట్, ట్రెయిల్ బాక్స్, లెన్సో మీటర్, గ్రేనింగ్ మెషీన్, 15 రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్, బ్రాండెడ్ లెన్స్, లెన్సులు కట్ చేసే కటింగ్ మెషీన్ వంటివి ఉంటాయి. వీటన్నింటికీ విభాగాల వారీగా వైద్య నిపుణులు నిరంతరం ప్రజలను పరీక్షిస్తుంటారు.
*అన్నీ పరీక్షలు ఉచితమే..*
విపిఆర్ నేత్ర బస్సులో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే ప్రజలకు అన్ని ఉచితంగా అందించనున్నారు. కంటి పరీక్షల దగ్గరి నుంచి కళ్ల జోళ్ల వరకు బస్సులోనే వాటిని తయారు చేయించి అందిస్తారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ముందుగా వైద్య నిపుణులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి వారి కంటి సమస్యలను గుర్తిస్తారు. అనంతరం వారి చూపును ఆధారంగా చేసుకుని అద్దాలు అవసరం అయితే వెంటనే మరో విభాగానికి రిఫర్ చేస్తారు. వారు బస్సులోనే అద్దాలు అందించి ప్రజల అభీష్టం మేరకు ఎంచుకున్న ఫ్రేమ్‌కు వాటిని సమకూర్చి అందజేస్తారు.
*దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో..*
ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్న విపిఆర్ నేత్ర కార్యక్రమం దశలవారీగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది. వరికుంటపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మరో మండలానికి విస్తరించేలా విపిఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో ముందుకు సాగనున్నారు.