*విధ్వంసం నుంచి పూర్వవైభవం దిశగా ఏపీ*

*కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్రానికి మంచి రోజులు*

*ఐదేళ్లూ చేసిన పాపాలకు వైసీపీ నేతలకు నోరు తెరిచే హక్కు కూడా లేదు*

*మొదట వాళ్లు షర్మిల వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి*

*విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఉద్యోగాలు అమ్మేసుకున్న కాకాణి అండ్ బ్యాచ్*

*వెంకటాచలం మండలం కాకుటూరులో రూ.15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికిన కాకుటూరు వాసులు*

*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*

ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖలు మూతపడ్డాయి

ఇరిగేషన్ కాలువలు కనీసం పూడికతీతకు నోచుకోలేదు..వైసీపీ నేతలు పనులు చేయకుండానే బిల్లులు చేసేసుకున్నారు

ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుంతలు కూడా పూడ్చలేక రహదారులను అస్తవ్యస్తంగా మార్చారు

వ్యవసాయ శాఖ పరిధిలో అయితే బిందు తుంపర్ల సేద్యం లేదు..యాంత్రీకరణ లేదు..సూక్ష్మ పోషకాలు లేవు

కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పథకాలను కూడా మూలనపెట్టేశారు. దేశవ్యాప్తంగా అమలైన పథకాలను ఏపీలో కనిపించకుండా చేశారు

సెంట్రల్ గవర్నమెంటు 60 శాతం నిధులు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ పథకం ఐదేళ్లూ ఊసేలేకుండా పోయింది

వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి కలెక్షన్లలో మునిగితేలితే ఇరిగేషన్ మినిస్టర్ డాన్సులకు పరిమితమయ్యారు

ఒక విధ్వంసకరమైన పాలన నుంచి బయటపడిన ఏపీ కూటమి ప్రభుత్వ పాలనలో పూర్వవైభవం దిశగా ముందుకు సాగుతోంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు

ప్రజలకు తాగునీరు అందించే జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇప్పుడు ఆ పథకాన్ని తిరిగి అమలు చేసి రిజర్వాయర్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం జరుగుతోంది

జలజీవన్ మిషన్ ను ఎందుకు చేయలేకపోయారు..పోలవరం ప్రాజెక్టును ఎందుకు కట్టలేకపోయారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా ఎందుకు మిగిలిచ్చారు

జగన్ రెడ్డి ఏటా ప్రకటిస్తామన్నా జ్యాబ్ కాలెండర్ ఏమైపోయింది…డీఎస్సీ నోటిఫికేషన్లు ఏమైపోయాయో

ఒక ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు ఉండకూడదో…అలాంటివన్నీ పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు

మిర్చికి రూ.7 వేలు ధర నిర్ణయిస్తూ 2020లో జీఓ ఎంఎస్ నెం 28 ఇచ్చిన జగన్ రెడ్డి ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు

మా కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది..ధర కూడా రోజురోజుకీ పెరుగుతోంది

జగన్మోహన్ రెడ్డి మొదట తోడబుట్టిన చెల్లెలు మాటకు సమాధానం చెప్పాలని నా స్నేహితుడు కాకాణికి హితవు పలుకుతున్నాను

ఐదేళ్లు చేసిన పాపాలకు కాకాణి లాంటి వారు నోరుమూసుకుని ఉండాలి. దమ్ముంటే షర్మిల మాటలకు సమాధానం చెప్పాలి

జగన్మోహన్ రెడ్డి పరువు రాష్ట్రం, దేశంలోనే కాదు ఇంట్లో కూడా పోయింది

విక్రమ సింహపురి యూనివర్సిటీ ఏర్పాటు కోసం కాకుటూరు రైతులు తమ భూములను త్యాగం చేశారు

గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏడుగురు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిచ్చాం..వైసీపీ హయాంలో కాకాణి ఆయన చెంచాలు కలిసి 69 ఉద్యోగాలు అమ్ముకున్నారు

భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యతను విస్మరించి ఉద్యోగాలకు రేటు కట్టారు

ఈ రోజుకీ 48 మంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed