*విధుల నిర్వహణలో నిబద్ధతను పాటించండి : ఇంచార్జ్ కమిషనర్ నందన్*
కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగులుగా నియమితులవుతున్న సిబ్బంది విధుల నిర్వహణలో నిబద్దతతో వ్యవహరించాలని బదిలీపై వెళుతున్న కమిషనర్ సూర్య తేజ, ఇంచార్జ్ కమిషనర్ నందన్ లు సూచించారు.
కరోనా సమయంలో విధుల నిర్వహణలో మృతి చెందిన కె.వి. కృష్ణ కుమారుడు కె. సాయి చరణ్, జి. నారాయణ రెడ్డి కుమారుడు జి. శ్రావణ్ కుమార్ లకు, అనారోగ్య కారణాలతో విధుల్లో మృతి చెందిన మహబూబ్ బాషా కుమారుడు అర్షద్ బాషా, వై. చెంచయ్య కుమార్తె శ్రీమతి వై. లక్ష్మి జ్యోత్స్న లకు కారుణ్య నియామక పత్రాలను కమిషనర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు.