విద్యుత్ సంస్థ కు పిల్లర్ లైన్ మ్యాన్*

*ప్రతి ఇంట వెలుగులు నింపేవాడు లైన్ మ్యాన్*

– ఎస్.ఈ. వి. విజయన్

నెల్లూరు విద్యుత్ భవన్ లోని స్కాడా బిల్డింగ్ లో లైన్ మ్యాన్ దినోత్సవ వేడుకలను మంగళవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టౌన్ శ్రీ ఎం. శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి గా పాల్గొన్న జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ వి.విజయన్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థ కు ఓ&ఎమ్ (ఆపరేషన్&మెయింటనెన్సు) సిబ్బంది పిల్లర్ లాంటి వాళ్లు కొనియాడారు. ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా మార్చి 4 వ తేదీని లైన్ మ్యాన్ దినోత్సవం గా పరిగణించబడుతుంది అని తెలిపారు. విద్యుత్ సిబ్బంది ఉద్యోగం చాల జాగ్రత్తగా చేయాలని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు మరియు ఒక బ్రేక్ డౌన్ వచ్చింది అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. తానుఎప్పుడు ఒకటి నమ్ముతానని ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే వారి కుటుంబ వ్యవస్థ కూడ చక్కగా ఉంటుంది అని ఎప్పుడైతే మనం విదినిర్వహణ లో అంకితభావంతో పనిచేయమో అప్పుడు మన కుటుంబ వ్యవస్థ కూడ బాగుండదు అని తెలిపారు. అందరి కుటుంబాలలో వెలుగులు నిలిపేది మీరే అని తెలిపారు.విద్యుత్ సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ అని తెలిపారు.లైన్ మ్యాన్ దివాస్ ను ఇంత చక్కగా ఏర్పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
తరువాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ లైన్ మ్యాన్ దివాస్ కార్యక్రమం చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ఫీల్డ్ లో పనిచేయుచున్నప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరంత ఒత్తిడి చేసిన తగు జాగ్రత్తలు తీసుకుని ఫీల్డ్ లో పని చేయాలని తెలిపారు . వినియోగదారులతో మంచి సంబంధాలు కలిగివుండలని తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు.

ఈ సంధర్భంగా టౌన్ డివిజన్ లోని 12 సెక్షన్ లలో ఒక్కొక సెక్షన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒకరికి ఉత్తమ సేవా పురస్కారం అందించడం జరిగింది. వీరిలో ఏ. కె.నగర్ సెక్షన్ నుండి టి. రాజేష్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్-2, బి.వి.నగర్ సెక్షన్ నుండి షేక్ ఫయాజ్ బాష అసిస్టెంట్ లైన్ మ్యాన్ , ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెక్షన్ నుండి కె.నరేంద్ర లైన్ మ్యాన్, డైకస్ రోడ్డు సెక్షన్ నుండి ఎస్. సుధాకర్ లైన్ మ్యాన్,టౌన్ హాల్ సెక్షన్ నుండి వై. నరసింహులు జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2, కిసాన్ నగర్ సెక్షన్ నుంచి పి. రాజు సీనియర్ లైన్ మ్యాన్ , రామ్మూర్తి నగర్ సెక్షన్ నుంచి వి. చంద్ర అసిస్టెంట్ లైన్ మ్యాన్ , స్టోన్ హౌస్ పేట సెక్షన్ నుంచి పి. నాగేశ్వర రావు జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2, హరనాథ్ పురం సెక్షన్ నుండి సిహెచ్. సురేష్ బాబు లైన్ ఇన్ స్పెక్టర్ ,వెంకటేశ్వర పురం సెక్షన్ నుండి ఎం. నరసింహులు జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2,రాజేంద్ర నగర్ సెక్షన్ నుంచి ఎస్. శ్రీనివాసులు లైన్ మ్యాన్, కోటమిట్ట సెక్షన్ నుంచి ఎస్. శివ నాగ బ్రహ్మ లైన్ మ్యాన్ లకు ఉత్తమ సేవా పుష్కరాలు అందించడం జరిగింది. తరువాత ఎస్.ఈ. చేత కేక్ కట్ చేపించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అశోక్ , సునీల్ , కిరణ్ మరియు డివిజన్లోని అసిస్టెంట్ ఇంజనీర్స్ ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed