*విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష*
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచేడు మరియు కుడితి పాళెం వద్ద 33/11 KV సబ్ స్టేషన్స్ నిర్మాణాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైపాడు నరసాపురం వద్ద RDS వర్క్ స్టేషన్స్ పనులు మరియు కోవూరు నియోజకవర్గంలో SC, ST కాలనీలలో ఎక్స్ టెన్షన్స్ త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైపాడు రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా వున్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు వేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సూచించారు. నుడా నుంచి వచ్చే నిధులతో స్తంభాల మార్పిడి పనులకు సంబంధించిన పనుల బిల్లులు చెల్లించడంతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించాలని అధికారులను కోరారు. బుచ్చిరెడ్డి పాళెం మండలం మినగల్లు వద్ద 132/33 KV సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వివరాలను అడిగి తెలుసు కున్నారు. కొరుటూరు సబ్ స్టేషన్ లో ఖాళీగా వున్న ఉద్యోగ నియామకాలు త్వరతగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్కో అధికారులతో పాటు బుచ్చిరెడ్డి పాళెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.