09-01-2025.

*విజయవంతంగా జాతీయ యువజన దినోత్సవం*

జిల్లా యువజన సంక్షేమ శాఖ- సెట్నెల్ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనదినోత్సవమును డి.కె.డబ్ల్యూ. డిగ్రీ కళాశాల, నెల్లూరు నందు అట్టహాసంగా నిర్వహించబడినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్రమ సింహపురి యునివర్శిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ యస్ విజయభాస్కర్ రావు గారు మట్లాడుతూ దేశ నిర్మాణానికి మూల స్తంభంలాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి శ్రీ స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారని అందులో “స్వయంకృషి పట్టుదల ధృడసంకల్పం ఈ మూడు మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తిర్చిదిద్దుతుంది అనే ప్రసంగాన్ని యువతకు తెలియజేస్తూ యువత దానిని స్పూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు.

శ్రీ ఎ. నాగేశ్వరరరావు, ముఖ్యకార్యనిర్వహణాధికారి, సెట్నెల్, నెల్లూరు గారు మాట్లాడుతూ యువత అందరూ శ్రీ స్వామివివేకానందుని బాటలో నడవలని యువతను ఉద్దేశించి పట్లుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుందని ఒక్కరోజులో ఏమి సాధించలేమని తెలియజేశారు.

శ్రీ శ్రీనివాసులు, ఆర్.ఐ.ఒ., నెల్లూరు వారు మాట్లాడుతూ యువత అందరూ మందలో ఒక్కరిగి వుండకండి వందలో ఒక్కరిగా ఉండటానికి ప్రయత్నించాలని తెలియజేశారు.

డా|| పోకల రవి, చెస్ట్ ఫిజిషియన్ గారు మట్లాడుతూ సత్యం సమాజానికి తలవంచదు సమాజమే సత్యానికి తలవంచుతుందని అదేవిధంగా ఇప్పుడు ప్రచారంలో వున్న వైరస్లు ఏవి ఏమిచేయవని వాటిపై అపోహలు అవసరం లేదని తెలియజేశారు.

శ్రీ స్వామి హృదయానంద, రామకృష్ణ మిషన్, నెల్లూరు మాట్లాడుతూ ఏ దేశం పురోగతి సాధించాలన్న యువతను విజ్ఞానవంతులుగా నిపుణులుగా తీర్చిదిద్దుకోవాలని అనే శ్రీ స్వామి వివేకానంద సూక్తిని తెలియజేస్తూ దేశం యొక్క భవిష్యత్తు యువత బుజస్కందాల మీద వుందని, అందరూ వివేకానందుని మార్గంలో ప్రయాణించినప్పుడే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎ. మహేంద్ర రెడ్డి, జిల్లా యూత్ ఆఫీసర్, నెహూయవకేంద్ర, నెల్లూరు, శ్రీ డి. రామకృష్ణ, ఇంచార్జ్ ప్రిన్సిపల్, డి.కె.డబ్లూ. డిగ్రీ కళాశాల, నెల్లూరు, డా|| కె. ఈశ్వరమ్మ, కల్చరల్ కన్వీనర్, డి.కె. డబ్ల్యూ. డిగ్రీ కళాశాల, నెల్లూరు, సెట్నెల్ సువరింటెండెంట్ శ్రీ మహ్మద్ గయాస్ అహ్మద్ గారు, మేనేజర్ శ్రీ బి.శ్రీనివాసరావు గారు మరియు సెట్నెల్ & కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

నాగ్ నే

ముఖ్యకార్యనిర్వహణాధికారి సెట్నెల్ – నెల్లూరు

 

*జన హుషార్ న్యూస్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *