*”విజయదీపిక – స్టడీ మెటీరియల్” రూపొందించిన ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ*
ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ….
మార్చి 2025 జరగబోవు SSC పరిక్షలకు, జిల్లాలో వున్న 318 జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 15,597 పదవ తరగతి విద్యార్ధిని విద్యార్ధులను సమాయత్తం చేయుటకు, అన్ని సబ్జెక్టులకు సంబందించిన షుమారు 40 మంది ఉపాధ్యాయులు మరియు విషయ నిపుణులతో చర్చించి ప్రశ్నల వారీగా పాఠ్యాంశములలోని ముఖ్య ప్రశ్నలను, మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించి “విజయదీపిక – స్టడీ మెటీరియల్” (ఇంగ్లిష్ మరియు తెలుగు మీడియం) లలో జిల్లా ప్రజా పరిషత్ ద్వారా విద్యార్ధులకు అందిస్తున్నాము.
“విజయదీపిక – స్టడీ మెటీరియల్” రూపొందించడములో కృషి చేసిన షుమారు 40 మంది ఉపాధ్యాయులను ఈ రోజు సన్మానించడమైనది.
ఈ స్టడీ మెటీరియల్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నిన్న నుండి పంపిణి చేయడము ప్రారంభం అయినది.
పడవ తరగతి విద్యార్థిని విద్యార్ధులు భావి జీవితాన్ని దృష్టిలో వుంచుకొని, మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చుటకు ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నాను.
జిల్లాలోని ఉపాధ్యాయులంతా అంకిత భావంతో కృషిచేసి మెరుగైన ఫలితాల సాధనకై మరియు ఫలితాలలో జిల్లాను ప్రధమ స్థానములో నిలపాలని కోరుకుంటున్నాను.
“స్టడీ మెటీరియల్” ను రూపొందించిన నిపుణులైన ఉపాధ్యాయులకు నా ప్రత్యేక ధన్యవాదములు.
ఈ “స్టడీ మెటీరియల్” తయారీ కొరకు కృషి చేసిన ZP CEO శ్రీమతి విద్యరమ గారికి, ZP Dy. CEO శ్రీ మోహన్ రావు గారికి, DEO శ్రీ బాలాజీ రావు గారికి మరియు DCEB సెక్రటరీ శ్రీ T.V. రామ కుమార్ గారికి నా ధన్యవాదములు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డీఈవో, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.