*విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణం* – వివేకానంద విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందాలి. – తల్లి తండ్రుల ఆకాంక్షలు నెరవేర్చండి. – విద్యార్థులకు సమయ పాలన అవసరం. – పరాజయం విజయానికి పునాది కావాలి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. చదువు పరీక్షల కోసం మాత్రమే కాదు. జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన వివేకానంద విద్యా సంస్థల 28 వ వార్షికోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల ఫౌండర్స్ రాధాకృష్ణ, ఉషారాణి గార్లు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భముగా వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సామాజిక సేవకు సంబంధించి ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ విద్యార్థులను అలరించింది. వేదికపై ఆశీనులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ దినేష్ గారు గజమాలతో ఘన సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితానికి ఒక బలమైన పునాదిని నిర్మించే సమయమన్నారు. జీవనం వేరు జీవితం వేరని రెండిటినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగాలని ఆమె విద్యార్థినీ, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. “The Best Preparation for Tomorrow is doing your best Today” అనే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిషత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. “Success is not a destination, It’s a Journey” విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణమని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర అభ్యాసం అవసరమన్నారు. పరాజయానికి భయపడవద్దని అది విజయానికి పునాది లాంటిదన్నారు. ప్రతి విజయం వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. ఓడిపోయినా తిరిగి లేచే తత్త్వం మీలో ఉండాలన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాటలతో విద్యార్థులు ఉత్తేజ భరితులై కేరింతలు కొట్టారు. వ్యక్తిగత విజయమే కాదు, నలుగురికి సహాయపడే సేవా దృక్పధం అలవర్చు కోవాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులుగా వున్న మీరందరూ సమాజాన్ని మార్చే నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను మెరుగు పరుచుకుంటేనే పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లగలమన్నారు. విద్యా బుద్ధులు నేర్పి మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు పడే తపనను అర్ధం చేసుకోగలిగితే.. మీ పేరెంట్సే మీకు రోల్‌ మోడల్‌ అవుతారని హితోపదేశం చేసారు. లక్ష్యాలపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వివేకానంద విద్యా సంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆశీర్వచనాలు అందచేశారు.

Byjanahushaar.com

Feb 9, 2025

*విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణం*

– వివేకానంద విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందాలి.
– తల్లి తండ్రుల ఆకాంక్షలు నెరవేర్చండి.
– విద్యార్థులకు సమయ పాలన అవసరం.
– పరాజయం విజయానికి పునాది కావాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

చదువు పరీక్షల కోసం మాత్రమే కాదు. జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన వివేకానంద విద్యా సంస్థల 28 వ వార్షికోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల ఫౌండర్స్ రాధాకృష్ణ, ఉషారాణి గార్లు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భముగా వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సామాజిక సేవకు సంబంధించి ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ విద్యార్థులను అలరించింది. వేదికపై ఆశీనులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ దినేష్ గారు గజమాలతో ఘన సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితానికి ఒక బలమైన పునాదిని నిర్మించే సమయమన్నారు. జీవనం వేరు జీవితం వేరని రెండిటినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగాలని ఆమె విద్యార్థినీ, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
“The Best Preparation for Tomorrow is doing your best Today” అనే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిషత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. “Success is not a destination, It’s a Journey” విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణమని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర అభ్యాసం అవసరమన్నారు. పరాజయానికి భయపడవద్దని అది విజయానికి పునాది లాంటిదన్నారు. ప్రతి విజయం వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. ఓడిపోయినా తిరిగి లేచే తత్త్వం మీలో ఉండాలన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాటలతో విద్యార్థులు ఉత్తేజ భరితులై కేరింతలు కొట్టారు. వ్యక్తిగత విజయమే కాదు, నలుగురికి సహాయపడే సేవా దృక్పధం అలవర్చు కోవాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులుగా వున్న మీరందరూ సమాజాన్ని మార్చే నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను మెరుగు పరుచుకుంటేనే పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లగలమన్నారు. విద్యా బుద్ధులు నేర్పి మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు పడే తపనను అర్ధం చేసుకోగలిగితే.. మీ పేరెంట్సే మీకు రోల్‌ మోడల్‌ అవుతారని హితోపదేశం చేసారు. లక్ష్యాలపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వివేకానంద విద్యా సంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆశీర్వచనాలు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *