
*పత్రికా ప్రకటన (23.12.2024)*
*SPS నెల్లూరు జిల్లా…*
- *విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్*
*ఈ రోజు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 90 ఫిర్యాదులు స్వీకరణ.*
*’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు.*

*జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా యస్.పి. గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*
*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి _మొత్తం 90 ఫిర్యాదులు_ వచ్చాయి …*
*వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …*
1. *దర్గామిట్ట పరిధికి చెందిన వ్యక్తికి, అనామకులు ఫోన్ చేసి, HDFC ట్రేడింగ్ యాప్ ద్వారా కొట్లలో డబ్బు సంపాదించవచ్చని, సెబి ద్వారా అనుమతి ఉందని నమ్మించి, 33 లక్షలు నగదు వేయించుకొని మోసం చేసి, వేధిస్తున్నాడని, మోసపోయానని, విచారించి న్యాయం చేయాలని కోరారు.*
2. *దర్గామిట్ట పరిధికి చెందిన మహిళ, తన కుమార్తె ఓ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వహిస్తూ, కనిపించడం లేదని, ఆచూకీ కొనుగొని అప్పగించాలని కోరారు.*
3. *బిట్రగుంట పరిధికి చెందిన వృద్దుడు, తన కొడుకు కొండల రావు అనే వ్యక్తి ఆస్థి మొత్తం తీసుకొని, ఇబ్బంది పెడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.*
4. *దుత్తలూరు మండల పరిధికి చెందిన ఓ గ్రామస్థులు, వారి ఊరిలోని నల్లబోతుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఊరిలో వారి ఆస్థులు ఒకరి పేరు మీద ఉన్నవి మరొకరి పేరు మీదకి మార్చడం, గ్రామస్తుల పట్ల దౌర్జన్యాలకు పాల్పడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు.*
5. *బాలాజీనగర్ పరిధికి చెందిన ఓ మహిళ, తన 5 సంవత్సరాల కుమార్తె పట్ల పక్కింటి లారెన్స్ @చింటు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు.*
6. *మనుబోలు పరిధికి చెందిన మహిళ, తన భర్త చెడు వ్యసనాలకు లోనై వేధించడం, అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా బుచ్చి పరిధికి చెందిన మహిళను అత్తమామలు నిరంతరం వేధిస్తున్నారని, కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దాలని కోరారు.*
7. *రాపూరు పరిధికి చెందిన మహిళను, రామయ్య మరి కొంత మంది కలిసి పాతకక్ష్యలను మనసులో పెట్టుకొని హత్యాప్రయత్నం చేయబోయారని, ఆటోతో గుద్ది చంపబోయారని, విచారించి న్యాయం చేయాలని కోరారు.*
*’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.*
*ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, యస్.బి. DSP శ్రీ శ్రీనివాసరావు, రూరల్ DSP శ్రీ జి. శ్రీనివాసరావు, DTC DSP శ్రీ గిరిధర్ రావు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, SB-2 CI గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.*
జిల్లా పోలీసు కార్యాలయం- SPS నెల్లూరు జిల్లా