
*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకుడికి అంతర్జాతీయ పురస్కారం*
నెల్లూరు:
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, సోషియల్ వర్క్ విభాగానికి చెందిన డా. బి. వెంకట సుబ్బా రెడ్డి గారు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ రంగంలో చేసిన విశిష్ట పరిశోధనా సేవలకు గాను వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ప్రకటించిన “అవుట్‌స్టాండింగ్ రిసెర్చర్ ఇన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ – 2025” అవార్డును అందుకున్నారు.
వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈసారి “సామాజిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు” అన్న థీమ్‌తో ARM 2025 కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ అవార్డు చెన్నైలో గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగిన 11వ వార్షిక రిసెర్చ్ మీట్ & అవార్డ్స్ – ARM 2025 కార్యక్రమంలో ప్రదానం చేయబడింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభానికి చెందిన డా. వెంకట సుబ్బా రెడ్డి కి అంతర్జాతీయ అతిథులైన—
డా. ససితరన్ ఇయావూ, యూనివర్సిటీ ఆఫ్ లింకన్, ఇంగ్లండ్
డా. సురేష్ పిల్లై, నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్, సింగపూర్
డా. అరుట్‌చెల్వన్ రాజమనికం, యూనివర్సిటీ ఆఫ్ మలయా, మలేషియా
డా. సోమసుందరం పిల్లై, విక్టోరియా మ్జెంగె హాస్పిటల్, దక్షిణాఫ్రికా చెందిన పరిశోధన నిపుణులు చేతుల మీదుగా అందజేశారు.
ఈ అవార్డు పట్ల విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు మరియు రిజిస్ట్రార్ డా.కే. సునీత మరియు సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. మధుమతి, NSS కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం మరియు విశ్వవిద్యాలయం వర్గాలు, సహచర అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. సామాజిక అభివృద్ధి, గ్రామీణ ప్రజల సంక్షేమం, సామాజిక సమస్యల పరిష్కారంపై ఆయన చేస్తున్న పరిశోధనలకు ఇది అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.