
*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎస్.ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎర్రగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు*
ఎర్రగుంట గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం నాలుగవ రోజు పూర్తి చేసుకుంది.
నాలుగవ రోజు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎర్రగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు
ఈ వైద్య శిబిరంలో దాదాపు 150 మందికి పైగా ఎర్రగుంట గ్రామ ప్రజలకు ఆరోగ్య సమస్యల పైన ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.
అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో మహిళలకు బెస్ట్ క్యాన్సర్ పరీక్షలు బీ.పీ షుగర్ వంటి పరీక్షలను నిర్వహించారు దీంతోపాటుగా ఈ.సీ.జీ పరీక్షలను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని అందించినటువంటి డాక్టర్ మహేష్ గారికి మరియు వారి బృందానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం సమన్వయకర్త డాక్టర్ బి వెంకటసుబ్బారెడ్డి, ఎర్రగుంట గ్రామ స్థానిక నాయకులు వేణు గారు ,సునీల్ గారు తదితరులు పాల్గొన్నారు.