
*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం*
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం మూడవరోజు పూర్తి చేసుకుంది. మూడవ రోజు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు ఎర్రగుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించే అంశాలను మరియు పోషకాహార పదార్థాలు వాటి ద్వారా లభించే అటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పప్పు దినుసులు ద్వారా డెమో రూపంలో విద్యార్థులకు తెలియపరచడం జరిగింది .అనంతరం మధ్యాహ్నం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి హ్యాండ్ వాష్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పరిశుభ్రంగా చేతులను ఎలాంటి పద్ధతిలో కడుక్కోవాలో డెమో రూపంలో విద్యార్థులకు చూపించడం జరిగింది అనంతరం విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ నీ బలోపేతం చేసేటువంటి ఆటలను నిర్వహించారు. ప్రత్యేక శిబిరం లో భాగంగా రేపు జరగబోవు ఉచిత వైద్య శిబిరాన్ని ఎర్రగుంట గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి తెలియపరచడం జరిగింది. రెండో రోజు శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ వల్లపు మునిస్వామి గారు సందర్శించి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను చూసి వారు ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లును అభినందించారు.
ఈ ప్రత్యేక శిబిరానికి సమన్వయకర్తగా ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి వెంకటసుబ్బారెడ్డి వ్యవహరించారు. ఈ శిబిరంలో కెమిస్ట్రీ విభాగం ఎం.బీ.ఏ విభాగం, టూరిజం విభాగం మరియు సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.