పత్రికా ప్రకటన
తేదీ: 30.12. 2024

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
జాతీయ సమైక్యత శిబిరంలో ప్రతిభ కనబరచిన ఎన్ ఎస్ ఏస్ వాలంటీర్లకు వి ఎస్ యు వి సి. అభినందనలు

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జివాజీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న లక్ష్మీభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఈనెల 21 నుంచి 27 వరకు జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్న ఎనిమిది మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర రావు గారు ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమములో ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర రావు NSS వాలంటీర్లకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసారూ. ఎముకలు కొరికే చలిలో కూడా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమదైన శైలిలో కల్చరల్ మరియు లిటరరీ కాంపిటీషన్లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచారని తద్వారా కీర్తిని జాతీయస్థాయిలో మరోసారి మార్మోగించారని అన్నారు. 17 రాష్ట్రాలు పాల్గొన్న ఈ జాతీయ సమైక్యతా శిబిరములో లో వి ఎస్ యు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పోస్టర్ పెయింటింగ్ లో తృతీయ స్థానం సాధించిన కుమారి శాలిని ను మరియు ఈ బృందానికి ప్రాతినిధ్యం వహించిన విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి ఐ సునీల్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించి మొమెంటోను మరియు సర్టిఫికెట్ ను ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ NSS వాలంటీర్లు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయం గుర్తింపు తీసుకు రావటం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. విద్యార్థులే విశ్వవిద్యాలయానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని. ఏ కళాశాలకైనా అక్కడున్న బిల్డింగ్స్ ఇతర సదుపాయాల వల్ల వచ్చే గుర్తింపుకన్నా ఆ కళాశాల విద్యార్థులు ప్రతిభ ద్వారా వచ్చే గుర్తింపు ముఖ్యమైనదని అన్నారు. విశ్వవిద్యాలయ NSS విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మరియు వారిలో దాగి వున్న ప్రతిభను పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమములో NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్ అల్లం, విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దీన్ దయాల్ గారు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు,డాక్టర్ ఎస్ బి సాయినాథ్, డాక్టర్ బి వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎ శ్రీనివాస రావు, కె. సైదులు, యం.శాలిని ప్రియ, జి. వినోద్ సాయి కుమార్ రెడ్డి, కె. లోహిత, వై జితేందర్ బాబు, వర్షా చౌదరి, కె. వి సుశ్రీత ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed