*విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంట్…*
….
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ జోన్ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో జె.బి. కళాశాల, కావలి జట్టు తమ ప్రతిభతో విజేతలుగా మరియు విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల, నెల్లూరు జట్టు రన్నర్స్‌గా నిలిచారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు విచ్చేసి గెలుపొందిన జట్టుకు ట్రోఫీను అందజేసి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గెలుపు ఓటములు సహజమని క్రీడల్లో పాల్గొనడమే గొప్ప అని పేర్కొన్నారు.
అన్ని జట్లకూ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో జరగబోయే అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ టోర్నమెంట్ లో విశ్వవిద్యాలయం తమ సత్తా చాటాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ గారు, పిడి డాక్టర్ ఏ. ప్రవీణ్ కుమార్, టోర్నమెంట్ పరిశీలకులు సిహెచ్. మణికంఠ, ఇతర కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు మరియు కోర్సులు పాల్గొని విజేతలను అభినందనలు తెలియజేశారు.