*వికసిత భారతం వైపు 11 ఏళ్ల దృఢయాత్ర – పివిఎన్ మాధవ్*

*సేవ, సుపరిపాలన, సంక్షేమమే మోదీ పాలన పునాది: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు*

నెల్లూరు జూన్ 12:
భారతదేశం గత 11 సంవత్సరాలుగా సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమం అనే త్రిసూత్ర సిద్ధాంతంతో అమృతకాల దిశగా పయనిస్తోంది అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్ నెల్లూరు జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకి తెలిపారు.

ఆయన మాట్లాడుతూ – “ఈ కాలం మన దేశానికి మహత్తరమైన పురోగతిని తీసుకువచ్చింది. సామాజిక న్యాయం, ఆర్థిక శక్తీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే మూడు పునాదులపై భారతదేశం ఎదుగుతోందని” స్పష్టం చేశారు.

81 కోట్ల మందికి ఉచిత ధాన్యాలు, వీధి వ్యాపారులకు మేలు చేసే స్వనిధి పథకం, చిన్న వ్యాపారాలకు ముద్రా రుణాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అవినీతికి అడ్డుకట్ట – ఇవన్నీ ప్రధాని మోడీ పేదల పట్ల చూపిస్తున్న దయార్ద్రతకు నిదర్శనమని చెప్పారు. 44 లక్షల కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరడం దేశంలో పరిపాలనా పారదర్శకత ఎలా పెరిగిందో చూపిస్తోంది అన్నారు.

రైతుల సంక్షేమానికి పీఎం కిసాన్ బలంగా నిలిచింది: ప్రభుత్వానిదే. పీఎం కిసాన్ ద్వారా రూ. 3.7 లక్షల కోట్ల నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా, క్రెడిట్ కార్డు పరిమితి పెంపు – ఇవన్నీ రైతులకు భరోసా ఇచ్చాయి,” అని మాధవ్ చెప్పారు.జాతీయ విద్యా విధానం అమలుతో విద్య రంగంలో నూతన ఒరవడి ఏర్పడిందని తెలిపారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ ల సంఖ్య పెరిగింది. 1.6 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు.

ఉజ్జ్వల, మాతృ వందన, సుకన్య సమృద్ధి, ముద్రా లోన్స్ ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాదు, పీఎం ఆవాస్ పథకంలో 73% ఇళ్లు మహిళల పేరుమీద ఇవ్వడం మోదీ సర్కారు మహిళా సాధికారత పట్ల కలిగిన నిబద్ధతను నిరూపిస్తుందని చెప్పారు. 33% రిజర్వేషన్ అమలుతో రాజకీయాల్లోనూ మహిళలకు అవకాశాలు విస్తరించాయన్నారు.పన్ను మినహాయింపు గరిష్ఠాన్ని పెంచడం, 5జీ విస్తరణ, యుపిఐ విప్లవం, ఉడాన్ ద్వారా విమానయానం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు మధ్య తరగతి జీవితాలను మెరుగుపరిచాయని మాధవ్ పేర్కొన్నారు.

అయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాలు ఆరోగ్య సేవలను ప్రతి పౌరునికీ చేరుస్తున్నాయని తెలిపారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి పునాది వేయడంతో పాటు, ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశ సమగ్రతను బలపరిచారని చెప్పారు.వందే భారత్ రైళ్లు, గతి శక్తి మాస్టర్ ప్లాన్, ఆర్థిక వృద్ధి గణాంకాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ – ఇవన్నీ భారతదేశాన్ని వికసిత దేశంగా నిలిపే దిశగా తీసుకెళ్తున్నాయని పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు.”ఈ 11 సంవత్సరాల మోదీ పాలన భారతదేశానికి మార్గదర్శి కాలంగా నిలిచింది. ఇది ఒక కొత్త శకం ఆరంభం. ‘సభ్కా సాత్, సభ్కా వికాస్, సభ్కా విశ్వాస్’ అనే నినాదాన్ని ప్రతిదినం సాకారం చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు” అని మాధవ్ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నాపూ రెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కర్నాటి ఆంజనేయ రెడ్డి, కమల, రఘునాధ రాజు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్లూరు శ్రీనివాసులు,ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి .శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్సీ పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, యారబోలు రాజేష్ ,గడ్డం విజయ్ కుమార్, యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శిలు కాసా సీనయ్య, చిలకా ప్రవీణ్ కుమార్, మోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్, కరణం సుభాషిని, ప్రసాద్, కోవూరు ఇంచార్జ్ రాఘవయ్య, ఓబిసి జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, ట్రెజరర్ సి వి సి సత్యం, బిజెపి సీనియర్ నాయకులు బెల్లంకొండ మాలాద్రి, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య మండల అధ్యక్షులు మదన్ రెడ్డి, వీరాస్వామి, సాంబశివారెడ్డి, నాయుడు , సోషల్ మీడియా సిటీ కన్వీనర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed