*విఆర్ MCH స్కూల్ కు రూ. 1.20 కోటి విలువైన 4 బస్సులు బహుకరణ*
– రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి అభివృద్ధి బాటలో నడుస్తున్నామని తెలిపిన యూనియన్ బ్యాంక్ వారు
– నెల్లూరు వి ఆర్ ఎం సి హై స్కూల్లో జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ నందన్

నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది దాతలు ఫిదా అవుతూ ముందుకు వస్తున్నారు. నిరంతర శ్రామికుడు.. అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడని నేత మంత్రి నారాయణ అని వారు కొనియాడుతున్నారు. అభివృద్ధిలో తమ వంతు సహకారం అంటూ పలువురు ముందుకొచ్చి పలు రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా నెల్లూరులో పేద నిరుపేద విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీతో విద్యను అందించేందుకు అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దిన వి ఆర్ ఎంసి హై స్కూల్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి 20 లక్షల విలువైన నాలుగు స్కూల్ బస్సులను బహూకరించారు. స్థానిక వి.ఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో మంగళవారం స్కూల్ బస్సుల ప్రారంభోత్సవం చేపట్టారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ హాజరై జెండా ఊపి స్కూల్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనల మేరకు అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed