*వర్షాకాలం సమయంలో వరద నీరు కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు అనువుగా తీసుకోవలసిన చర్యలలో భాగంగా పంట కాలువల పునరుద్ధరీకరణ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి వివరించిన కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం సమీక్ష నిర్వహించారు.

అన్ని డివిజన్లలోని పారుదల పంట కాలువల పునరుద్ధరీకరణ పనుల అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై వారితో విశ్లేషించారు.

ముఖ్యంగా వర్షాకాలం సమయంలో వరద నీరు కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు అనువుగా తీసుకోవలసిన చర్యలలో భాగంగా పంట కాలువల పునరుద్ధరీకరణ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి కమిషనర్ వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, డీసీపీ రఘునాథరావు, ఏసీపి వేణు, వార్డ్ సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ , అడ్మిన్,రెవిన్యూ కార్యదర్శులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed