
*వర్షపు నీటి ప్రవాహానికి, డ్రైను కాలువలకు ఉన్న అడ్డంకులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన: నగర కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 16వ డివిజన్ జగదీష్ నగర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు.
డివిజన్ పరిధిలో వర్షపు నీటి ప్రవాహానికి, డ్రైను కాలువలకు ఉన్న అడ్డంకులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లను సందర్శించి వాటికి సంబంధించి అన్ని ప్లాట్లకు అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క ఫ్లాట్ యజమానికి అసెస్మెంట్ డిమాండ్లను జారీ చేయాలని, ఆస్తి కలిగిన ప్రతి ఒక్కరిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని రెవెన్యూ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.