*వరద బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలి*
*మొంత తుఫాన్ నష్ట నివారణ చర్యలు చేపట్టిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు*

వరద బాధితులును ఆదుకోవాలని ..
బిజెపి నేతలు మిడతల రమేష్ కందికట్ల రాజేశ్వరిలు నెల్లూరు డిఆర్ఓ కు వినతిపత్రం సమర్పించారు.
నెల్లూరు జిల్లాలో వరుస వర్షాలు తుఫాను ప్రభావంతో 3300 ఎకరాలలో కోతకు వచ్చిన పంట నీట మునిగింది.. ఎకరాకు 40000 చొప్పున సుమారు 132 కోట్ల మేర ధాన్యం రైతులు నష్టపోయారు.
1996 చేనేత మగ్గాలలో నీరు చేరడంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు.
నీటిపారుదల సెంట్రల్ డివిజన్ పరిధిలో 100 కోట్ల మేర చెరువులు కాలువలు రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి.
కండలేరు జలాశయ పరిధిలోని బ్రాంచ్ కాలువల గండ్లు వలన రెండు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.

*కండలేరు ఎర్త్ డ్యాం నిర్మించి 30 సంవత్సరాలు దాటినందున మట్టికట్ట పటిష్టత కోసం 50 కోట్ల* రూపాయలుపైగా వ్యయం చేయాల్సి ఉంది.
తుఫాన్ ప్రభావంతో ఇద్దరు మనుషులు గల్లంతయ్యారు.
600 బాతులు చనిపోయాయి.
ఆరు గొర్రెలు.తొమ్మిది బర్రెలు మృత్యువాత పడ్డాయి.
రోడ్ల మరమ్మత్తుల కోసం 22 కోట్ల రూపాయలు అవసరమవుతుంది.. సమగ్ర విచారణ జరిపి తుఫాన్ బాధితులును ఆదుకోవాలని రమేష్ రాజేశ్వరమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..

ఈ కార్యక్రమంలో రఘురామయ్య నరాల సుబ్బారెడ్డి.ఏవి సుబ్బయ్య.టి శ్రీనివాసులు.నారాయణ యాదవ్.రాములు యాదవ్. ఆదినారాయణ. అల్లూరు నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed