*వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు-2025 కరపత్రాల విడుదల చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు గౌ.శ్రీ. శీపారెడ్డి వంశీధర్ రెడ్డి*

నెల్లూరు, ఏప్రిల్ 22: భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు-2025 కు సంబంధించి కరపత్రాలను బిజెపి జిల్లా అధ్యక్షులు గౌ.శ్రీ. శీపారెడ్డి వంశీధర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి లాభాలు చేకూరనున్నాయని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ మోర్చా కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటిలోని ముస్లిం మహిళలకు, యువతకు ఈ సవరణ బిల్లు ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలియజేయాలని సూచించారు. అలాగే, కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సమాజాన్ని తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ బిల్లుతో ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందనే అపోహలను ప్రజల్లోనుండి తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యరబోలు రాజేశ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మొగరాల సురేష్, ముస్లిం మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు షేక్ లాల్ ఖాజా మస్తాన్, హీదాయతుల్లా, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముక్కు రాధాకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిని, జిల్లా కార్యదర్శి పరశురాం, రామలింగాపురం మండల అధ్యక్షులు మదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed