వక్ఫ్ బోర్డ్ అధికారులు గతంలో బాగా పని చేసి ఉంటే ఇంకా బాగా చేయాలి.
బాగా పని చేయకపోయి ఉంటే ఇక పై బాగా పనిచేయాలి :ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ .
జిల్లాలో వ్యాప్తంగా వక్ఫ్ స్థలాల స్థితిగతులను పొందుపరచండి.
32 వేల ఎకరాలు అన్యాక్రాంతం కావటానికి గల కారణాలు తెలపండి.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జిల్లాల వక్ఫ్ బోర్డ్ సీఈఓ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్ తో నెల్లూరు లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
అబ్దుల్ అజీజ్ కామెంట్స్:-
గతంలో వక్ఫ్ బోర్డ్ అధికారులు బాగా పని చేసి ఉంటే ఇంకా బాగా పనిచేయాలని, బాగా పనిచేయకపోయి ఉంటే ఇకపై బాగా పని చేయాలని తెలిపారు.
వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాల వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల స్థితిగతులను పొందుపరచాలని, ఉన్న వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ముందుగా మిగిలి ఉన్న వక్ఫ్ స్థలాలు అన్నిటికీ జియో ట్యాగింగ్ చేయాలని, 32 వేల ఎకరాల వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం కావడానికి గల కారణాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. సెంట్ భూమిని సైతం రికార్డ్ లలో పొందుపరచాలని అన్నారు.