విజయవాడ,
01.01.2025.
వక్ఫ్ బోర్డ్ అధికారి షఫీఉల్లా మృతికి సంతాపం తెలిపిన అబ్దుల్ అజీజ్
ఏపీ వక్ఫ్ బోర్డ్ అధికారి షేక్ షఫీఉల్లా
గుండె పోటుతో మృతి చెందడం, వక్ఫ్ బోర్డ్ ఉద్యోగులకు విస్మయం కలిగించిందని, ఆయన మరణం వక్ఫ్ బోర్డ్ కు తీరని లోటని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. షఫీఉల్లా మృతి పట్ల అబ్దుల్ అజీజ్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా షేక్ షఫీఉల్లా చేసిన పనితీరును గుర్తు చేసుకున్నారు. వక్ఫ్ బోర్డ్ కార్యాలయం మంచి ఆత్మీయుని కోల్పోయిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన షఫీఉల్లా కుటుంబ సభ్యులకు అన్నీ విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.