*లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ తక్షణమే విరమించుకోవాలని సదస్సు.*

**************************

* *లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ ఎదురుగానున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా మాజీ శాసనమండలి సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు,విఠపు బాలసుబ్రమణ్యం లు హాజరయ్యి ప్రసంగించారు.*

* *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26,29,30 లలో మత స్వేచ్ఛ, భాషా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కల్పించడం జరిగినదని అన్నారు. విభిన్న జాతులు,మతాలు , భాషలు,సంస్కృతుల,సంప్రదాయాల కలయిక గా భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా గత పాలకులు వ్యవహరించారని అన్నారు. దానికి భిన్నంగా మతపరమైన సున్నిత అంశాలను రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందేందుకు బిజెపి ఆర్ఎస్ఎస్ లు దేశ ప్రజల మధ్య అనేక రకాల చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, గో సంరక్షక దళాలు లాంటి రకరకాల వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు విధానాల అమలు వల్ల భారతదేశంలోని ప్రజల మధ్య అనేక రకాల విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. దానిలో భాగంగానే నేడు వక్ఫ్ చట్ట సవరణ బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చినదని అన్నారు. ఈ విధానాలను వాటి వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ప్రజలు అప్రమత్తంగా గుర్తించి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఇది ముస్లిం మైనార్టీల సమస్య మాత్రమే గా చూడడం సరికాదన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తి కి తిలోదకాలు ఇచ్చే చర్యగా ప్రతి పౌరుడు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదం ఆచరణలో కింది స్థాయిలో ప్రజలందరూ ఆచరించి చూపించి బిజెపికి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడినదని అన్నారు. గతంలో అనేక మార్లు వీటికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో వామపక్షాలు చురుకైన పాత్ర పోషించి ప్రజల ఐక్యతను కాపాడడం జరిగిందని అన్నారు.*

* *తొలుత సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు వేదికపైకి అతిధులను ఆహ్వానించి స్వాగతం పలికారు.అనంతరం సదస్సుకు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా నాయకులు సిరాజ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సి.ఎస్.సాగర్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ పాల్గొన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed