*లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులతో రాష్ట్రాభివృద్ధి*
– పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి
– స్వాగతం పలికిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు
– స్వామి ఆశీసులు సీఎంపై మెండుగా ఉండాలని ఆకాంక్ష
శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం ఉదయం నరసింహస్వామిని, ఆదిలక్ష్మీ దేవి అమ్మవారిని దర్శించుకున్న ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ముందుగా స్వామివారి ఆలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలక్ష్మీదేవి అమ్మవారిని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని చూస్తే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రకృతి రమణీయతల మధ్య విరాజిల్లుతున్న స్వామివారి ఆశీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి మెండుగా ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, కాటంరెడ్డి రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.