
*“రోగాలు బయటపడకముందే AI చికిత్స చేస్తుంది – మానవుని జీవనకాలం 150 ఏళ్లు!”*
*రోబో డాక్టర్లు, DNA ట్రీట్మెంట్ – 150 ఏళ్లు బ్రతకడం ఇక కల కాదు! : డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకా ప్రవీణ్*
నెల్లూరు, అక్టోబర్ 14: 2050 నాటికి మన జీవితం ఇపుడు ఊహించలేనంతగా మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ మన దైనందిన జీవితంలో భాగం అవుతాయి, అని చిలక డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకా ప్రవీణ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ AI మరియు రోబోట్స్ మన స్నేహితుల్లా మారతాయి, ఇంట్లో పనులు చేసే రోబో మేడ్స్, ఆఫీస్‌లో సహాయక AI అసిస్టెంట్లు, పిల్లలకు పాఠాలు చెప్పే డిజిటల్ టీచర్లు ,ఇవన్నీ సాధారణ దృశ్యాలవుతాయి. మన జీవితం మరింత సులభం, స్మార్ట్‌గా మారుతుంది,” అని చెప్పారు.2050లో రైతులు మట్టిని తాకకుండానే పంటలు పెంచగలుగుతారు.
సెన్సర్ టెక్నాలజీ, డ్రోన్ ఇరిగేషన్, AI ఆధారిత వాతావరణ అంచనాలతో వ్యవసాయం పూర్తిగా డిజిటల్‌గా మారుతుంది. ప్రతి గింజను టెక్నాలజీ కాపాడే రోజులు రానున్నాయి.భవిష్యత్ స్కూల్స్‌లో విద్యార్థులు బోర్డుపై కాకుండా వర్చువల్ రియాలిటీ గ్లాస్‌లతో నేర్చుకుంటారు.
హైదరాబాద్, టోక్యో, లండన్ విద్యార్థులు ఒకే క్లాస్‌రూమ్‌లో కలసి చదివే అవకాశం ఉంటుంది. ఇది సరిహద్దులు లేని విద్యా యుగం అవుతుంది.రోగాలు బయటపడకముందే AI వాటిని గుర్తిస్తుంది. DNA ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక చికిత్స అందుతుంది. ఆపరేషన్లు రోబోట్స్ చేస్తాయి, వైద్యులు కేవలం మానిటరింగ్ మాత్రమే చేస్తారు.
భవిష్యత్తులో మానవుని జీవన కాలం 150 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది.గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ భవిష్యత్తులో ఇంధనం సోలార్, విండ్, హైడ్రోజన్ రూపంలో వస్తుంది. ప్రతి ఇల్లు ఒక చిన్న పవర్ స్టేషన్లా మారుతుంది.
ట్రాఫిక్ లేకుండా AI నియంత్రిత వాహనాలు, కాలుష్యం లేని సిటీలు మన పిల్లల భవిష్యత్తు. భారత టెక్ మేధస్సు ప్రపంచ భవిష్యత్తుని నడిపిస్తుంది. స్వదేశీ ఆవిష్కరణలతో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శి అవుతుంది,”అని ప్రవీణ్ తెలిపారు.