*”రైతుల పక్షాన పోరాడుతాం”- కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:06-09-2025*

*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 9వ తేదీన చేపట్టనున్న “ఎరువుల బ్లాక్ మార్కెట్, గిట్టుబాటు ధరపై అన్నదాతల పోరు – రైతన్నలకు బాసటగా వైయస్సార్సీపీ” కార్యక్రమ పోస్టర్ ను మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

– రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు, ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం.

– నెల్లూరు జిల్లాలోని అన్ని ఆర్డిఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి నిరసన తెలియజేసి, రైతుల పక్షాన అధికారులకు వినతి పత్రం అందజేస్తాం.

– రాష్ట్రంలో రైతులు ఎరువుల కొరత వలన యూరియా కోసం క్యూలలో నిలబడి అవస్థలు పడుతున్న పరిస్థితి.

– చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులు రోడ్డేక్కాల్సిన పరిస్థితి.

– కూటమి ప్రభుత్వంలో రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలివెళ్లిపోతూ, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

– వ్యవసాయ శాఖ 50 శాతం కంటే ఎక్కువ యూరియా డీలర్లకు ఇవ్వడంతో బ్లాక్ మార్కెట్ను నిరోధించలేకపోతున్నారు.

– యూరియా లేక పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

– నెల్లూరు జిల్లాలో పుట్టి (850 కేజీల) ధాన్యానికి గిట్టుబాటు ధర రూ.19,770/-లు ఉంటే, దానికంటే తక్కువగా అమ్ముకొని నష్టపోతున్న రైతులు.

– రైతాంగం ఒక ఎకరాకు 20వేల రూపాయలు నష్టపోతుంది.

– కూటమి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు, మద్దతు ధర అందించేందుకు ముందుకు రావడం లేదు.

– కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి పెట్టేలా, ఒత్తిడి తెచ్చేందుకు 9వ తేదీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

– జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా రైతు ముంగిటకే పంపిణీ చేశారు.

– 260/- రూపాయలు ఉన్న యూరియా బస్తా, 400 నుండి 600 రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో రైతులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి.

– రైతు భరోసా కేంద్రాల ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు యూరియా అందించాలనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్.

– రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.

– ఉచిత బీమా పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశాడు

– కూటమి ప్రభుత్వం రైతులకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలి నష్టపోయిన రైతులకు సహాయం అందించాలి.

– చంద్రబాబు అన్నదాత సుఖీభవా పథకాన్ని మొదటి ఏడాది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు.

– జగన్మోహన్ రెడ్డి గారు 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందిస్తే చంద్రబాబు 46 లక్షల మందికే అన్నదాత సుఖీభవా పథకం పరిమితం చేశాడు.

– చంద్రబాబు మొదటి విడత ఎగ్గొట్టి, రెండవ విడతలో 8 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవా ఎగనామం పెట్టాడు.

– రైతులకు పెట్టుబడి సహాయం లేక అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు.

– నెల్లూరు డివిజన్ నందు నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలిలోని మహనీయుడు బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది.

– కావలి పట్టణంలో ఉదయగిరి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు సాగనున్న నిరసన దీక్ష.

– ఆత్మకూరు పట్టణంలో యం.జీ.ఆర్. బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ సాగుతుంది.

– కందుకూరులోని అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతుల పోరు జరగనుంది.

– సూళ్లూరుపేటలోని జీయన్టీ రోడ్డు నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు, గూడూరు పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, రైతుల పక్షాన ఆర్డిఓ గారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది.

– ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంతో సహా 6 ప్రాంతాలలో రైతులతో కలిసి, అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందిస్తాం.

– ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తాం, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తాం.

– సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *