
*రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించాలని కలెక్టర్ ను కలిసిన*
*భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా నాయకులు*
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు, ఈనెల అనగా మార్చి ఒకటో తేదీ నుండి వరి కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా (1). RNR 15048 (షుగర్ లెస్) (2). KNM 1638 (3). KNM 733 (4)BPT 5204 రకాల వరి పంటలను సాగు చేస్తున్నారు.
గ్రేడ్ 1 రకాలైన ఈ ధాన్యం రకాలకు ప్రభుత్వం మద్దతు ధర (MSP) క్వింటాకు 2389/-రూపాయలు (ఒక్క పుట్టి కి 20వేల 300 రూపాయలు)గా నిర్ణయించింది మరియు తేమశాతం 17% గా సూచించింది.
కానీ రైతులు వరి కోత కోసిన సమయంలో తేమశాతం సుమారు 20% గా ఉంటుంది. ఈ తేమ శాతాన్ని 17 శాతానికి రావడానికి రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టు కునేందుకు కల్లాలు లేకపోవడం, పట్టలు లేకపోవడం కూలీలు దొరకకపోవడం వలన రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు (PPC సెంటర్లు) ద్వారా మద్దతు ధరకు అమ్ముకోలేక దళారుల ద్వారా రైస్ మిల్లర్లు అతి తక్కువ ధరకు మరియు నెమ్ము పేరుతో అధిక ధాన్యాన్ని ఇచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ పరిస్థితిని రైతులు మరియు రైతు సంఘాల ద్వారా తెలుసుకున్న గత సంవత్సరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న కార్తీక్ గారు మిల్లర్లను రైతులను పిలిపించి ప్రభుత్వం నిర్ధారించిన తేమశాతం 17% కంటే ఎక్కువ ఉన్న ప్రతి 1% శాతానికి ప్రతి క్వింటాకు 1 కేజీ చొప్పున హెచ్చుగా తీసుకునే విధంగా,
ఉదాహరణకు
18% – 101 KG
19% – 102 KG
20% – 103 KG
నిర్ణయించి గత సీజన్లో అమలు పరచడం జరిగింది.
అదే విధానాన్ని ఈ సీజన్ లో కూడా అమలు పరిచాలని వరికోతలు ప్రారభం కాకముందు మరియు వరకోతలు జరిగే సమయంలో అనేకమార్లు జిల్లా ఉన్నతాదికారులను కలిసి కోరడం జరిగింది.
ప్రస్తుతం ధలారుల ద్వారా మద్దతు ధరకంటే చాలా తక్కువ ధరకు 17000 నుండి 18500 రూపాయలకు పుట్టి(919kgలు) ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న మిల్లర్లు PPC సెంటర్ ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలంటే మాత్రం రైతుల నుండి పుట్టి ధాన్యానికి అదనంగా మరో యాభై కేజీలు ఇస్తేనే ధాన్యాన్ని తీసుకుంటామని రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు.
17% నెమ్ము శాతం ఉంటే పుట్టి (860 కేజీలు) తీసుకోవలసిన మిల్లర్లు ఎంత నెమ్ముశాతం ఉన్నా 950 kg ల నుండి 970 kgల వరకు డిమాండ్ చేస్తూ అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నందున
ప్రభుత్వ మద్దతు ధరకు గత సీజన్ లో లాగా మిల్లర్లు రైతులనుండి ధాన్యం కొనుగోలు చేసేవిధంగా అధికారులను ఆదేశించి ఇప్పటికే నష్టాలో కూరుకుపోయిన అన్నదాతలను కాపాడాలని బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమములో బిజెపి కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షులు తిరకాల మోహన్, బిజెపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నిగంటి శీనయ్య, రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా కార్యదర్శి వినయ్ నారాయణ, బిజెపి కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్సులు వి హర్ష వర్ధన్, పార్లపల్లి వెంకట మహేష్, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.