రైతులకు అండగా ప్రశాంతిరెడ్డి
– 22% తేమ ఉన్నా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంగీకారం..
– రైతుల పక్షాన నిలబడి విజయం సాధించిన ఎమ్మెల్యే
ఎన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరిష్కారం చూపారు. అధిక తేమశాతం ఉన్నా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపేలా కృషి చేసి రైతులకు విజయాన్ని అందించారు. ఇప్పటివరకు ధాన్యంలో 17్ర తేమ ఉంటే ప్రభుత్వం పుట్టికి రూ.19750 కి కొంటోంది. అయితే 17శాతానికి మించితే ధాన్యం కొనుగోలు తక్కువ ధరకు చేసేవారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రశాంతి రెడ్డి గారు.. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, జేసీతో మాట్లాడారు. తేమశాతం 22 ఉన్నా ప్రభుత్వ గిట్టుబాటు ధరకు కొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఎమ్మెల్యే రైతుల సమస్యను వివరించారు. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం అధికారులతో, ఎమ్మెల్యేతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి తేమశాతం 22 ఉన్నా క్వింటాకు కేజీ అధికంగా తీసుకుని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీనిపై శుక్రవారం అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించనున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే ఈ డెల్టా ప్రాంతంలో 90 శాతం పంట మార్చి 10 తర్వాత అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అప్పటినుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. రైతుల పక్షాన నిలబడి తేమశాతంపై పోరాడిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని రైతులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.